5 May 2016

స్నేహమనే బంధం....చివరి వరకు తోడుండే ధనం...
ఇస్తుంది ప్రతీ విషయం పంచుకునే స్వతంత్రం...
నీ కష్టాలను...తన కష్టాలు గా...
నీ ఇష్టాలను...తన ఇష్టాలు గా...
నీ కంటి చెమ్మను తుడిచే అమ్మగా మారి...
నీ మంచిని కొరే తండ్రిగా ప్రతిసారి...
ఓటమిలో వెన్ను తట్టి, విజయానికి బాట కట్టి...
నిన్ను నిన్నుగా ఉంచి, నీ కోసం సర్వస్వం అర్పించి...
నీ ఆనందానికి అర్థమై నిలచే...ఆ స్నేహం...
పొందగలిగితే నీ జన్మ ధన్యం...

సినిమా.... సరదా

మన ఇద్దరిదీ "పవిత్ర బంధం"
ఒంటరి అయిన నాకు కావాలి "నీ స్నేహం"

"మనం ఎప్పటికి "కలిసుందాం రా"
స్నేహానికి అర్థం "నువ్వూ నేను"

"ఒట్టేసి చెబుతున్నా" "నువ్వు లేక నేను లేను"
ఇది నా మనసు పలికే "మౌన రాగం"

నీవు విరబూసిన "రోజా"పువ్వులాగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
---అపర్ణ 

25 Mar 2016

ప్రియతమా...

నినుచూసిన నిమిషం పులకించెను నా హ్రుదయం,
మలుపు తిరిగెను నా గమ్యం,
నీ రాక కొరకై కునుకు మరచెనే నానయనం,
ఎదురు చూసిన ప్రతీక్షణం నాకాయినది ఒక యుగం,
వలదని చేయకే నా గుండెకు గాయం,
నీ ప్రేమకై అంకితం జీవితం,
నీవు లేని నన్ను ఊహించడమెంతో కష్టం,
కరుణించవా  ప్రియతమా...

మేలుకో ప్రేమిక


ప్రేమలో గాయాలు గేయాలకు ఊపిరులూదడం,
గేయాలు గాయాలకు లేపనాలు కావడం సహజం. 
భావుకత పొంగిపొరలి, హృదయం పులకించి, 
ప్రేయసి కరుణకై పరితపించు వేళ మిత్రమా, 
మలుపు తిరగనీయకు నీ గమ్యాన్ని, 
నిర్దేశించుకు ముందుకు సాగు పెద్ద లక్ష్యాన్ని... -- GM Rao.
 

15 Mar 2016

నేస్తమా...

స్నేహం, ఎవరూ వర్ణించలేని ఒక మథుర కావ్యం.
అడగకుండా దేవుడు ఇచ్చిన విలువైన వరం. 
ఎక్కడున్న, ఎలా ఉన్నా మనతో ఉండే ఆ పాశం, మన నుండి ఏమీ ఆశించదనేది జగమెరిగిన సత్యం. అలాంటి స్నేహం అపార్థం చేసుకుంటే నరకం. అలాంటి వేదన వర్ణనాతీతం. 
భరించలేని ఆ భారం నాతో మోయించవనే నమ్మకం, బతికిస్తుంది జీవితాంతం. 
                                                                                                     --- ఇట్లు నీ నేస్తం.
                                                                                                        

27 Feb 2016

అమ్మ

   పూవులోని పరిమళం
   పాలలోని కమ్మదనం
   జాబిలిలోని చల్లదనం
   తేనెలోని సుమధురం
   ఇవన్నీ కలబోసిన మన అమ్మే మనకి మూలధనం
    ----(అపర్ణ) 

22 Feb 2016

#HatsOff - Neerja Bhanot

Neerja Bhanot
కష్టాల కడిలిని దాటి,
కలలను సాకారం చేసుకొని,
అందంగా మలుచుకున్న నీ ప్రపంచంలో,
అనుకోని అలజడిని నీదైన శైలిలో ఎదుర్కొంటూ,
సాటివారి ప్రాణాలకు నీ ఊపిరి పోసి,
తిరిగిరాని లోకాలకు తరలిన ఓ నీరజ (భనోట్), నువ్వు అసలైన అవనిజ...
నీ త్యాగం చిరస్మరణీయం, నీ జీవితం మా అందరికీ ఆదర్శం...

For more information on Neerja
https://en.wikipedia.org/wiki/Neerja_Bhanot