ముందుగా ఉగాది శుభాకంక్షలు...
చైత్ర శుద్ధ పాడ్యమి - మన క్రొత్త సంవత్సరం మొదలు (ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు)
January 1st - English New Year (English వారి క్రొత్త సంవత్సరం).
చైత్ర మాసపు శుక్ల పక్ష శుద్ధ పాఢ్యమి నాడు, ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటాము.
ముందుగా ఉగాది పర్వదినాన, తెల్లవారు ఝామునే,సూర్యోదయమునకు ముందుగానే నిద్ర లేచి, శాస్త్రవిధిగా నువ్వుల నూనెతో తల అంటుకొని, నలుగు పెట్టుకొని, కుంకుడు కాయలతో తలంటి స్నానం చేస్తారు. నూతన వస్త్ర ధారణ, తిలక ధారణ, దైవారాధన చేయటం అనంతరం ఉగాది పచ్చడిని సేవించటం సాంప్రదాయం. తదనంతరం పెద్దల దీవెనలు పొందటం, దేవాలయ సందర్శన (పంచాంగ శ్రవణం) పుణ్య ఫలితాలను చేకూరుస్తాయి.
ఊగాది పచ్చడి:
షడ్రుచుల (ఆరు రుచులు) సమ్మేళనం, మన ఈ ఉగాది పచ్చడి.
1. చేదు (వేప పువ్వు/పూత)
2. వగరు (మామిడి పిందె)
3. తీపి (కొత్త బెల్లం)
4. పులుపు (చింత పండు)
5. కారం (పచ్చి మిరప)
6. ఉప్పు (లవణం)
ఈ ఆరు రుచులను మనలోని భావొద్వేగాలకు (ఆనందం,బాధ,కోపం,భయం,విసుగు మరియు ఆశ్చర్యం) ప్రతీకలుగా భావిస్తారు.

No comments:
Post a Comment