శ్రీరామ నవమి పండుగ, విశిష్టత...
ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు 😊
మనం శ్రీరామనవమిని, చైత్ర మాసంలోని 9వ రోజున అనగా చైత్ర మాస శుక్లపక్ష నవమి నాట జరుపుకుంటాం.
తెల్లవారు జామునే నిద్రలేచి, తలంటి స్నానం చేసి, క్రొత్త వస్త్రములను ధరించాలి. సీత,లక్ష్మణ,భరత,శత్రుఘ్న,ఆంజనేయ సమేత రామ చంద్ర మూర్తి పటమును లేదా సీతారాముల పటమును/విగ్రహామును కాని తమ శక్తి రీత్యా పూజా చేయవలెను. పానకం(నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపిన మిశ్రమం) మరియు వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు)లను, స్వామివారికి నివేదించి తదుపరి ప్రాసదముగా స్వీకరిచవలెను.
ఆ రోజున పగటి వేళ ఉపవాసం ఉండి, సాయంకాలం లేదా మధ్యాహ్నమున లేదా ప్రొద్దున్నే అవకాశాన్ని బట్టి గుడికి వెళ్ళి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ మరుసటి రోజు అందరూ కలిసి ఆలయంలో చేరి సంస్క్రత పరిజ్ఞానం ఉన్న పెద్దలను ఆహ్వానించాలి. వారిచే పట్టాభిషేక సర్గ వివరణ చేయించుకోవాలి. ఎంత అవకాశం ఉంటే అంత, శ్రీరామ నామముని లిఖించాలి. ముఖ్యముగా ఈ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథి శ్రీరామనవమి నాడు, రామనామం జపించిన\లిఖించిన\రామాలయానికి వెళ్ళిన\రామాయణం వినిన చాలు శుభములు చేకూరుతాయని ప్రతీతి.
మీ కోసం...
రమింపచేసేవాడు రాముడు. ఆ రామ నామం వినిన\జపించిన పిల్లలు పెద్దలు ఆనందం పొందుతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఓం నమో నారాయణాయ లోని "రా", ఓం నమః శివాయః లోని "మ"ల నుండి రామ అనే పేరు తీసుకొనబడినది అని చెప్తుంటారు. ఇవి కాకుండ ఈ పేరు వెనుక ఇంకా 27 వివరణలు ఉన్నయి అని వినికిడి.
దశావతారములలో, మనుష్య జీవితానికి దగ్గరగా ఉండే అవతారం రామవతారం. అందుకే రాముడు మనిషి రూపంలో ఉన్న దేవుడు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. శ్రీరాముడిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది, అది మిత్రులకే కాదు శత్రువులు కూడా. ఉదాహరణకు,
1. మారిచుడే స్వయంగా రావణుడితో "రామో విగ్రహాన్ ధర్మః" అని అన్నాడు, అంటే రాముడు విగ్రహరూపంలో ఉన్న ధర్మం అని అర్ధం.
2. వాలిని చంపిన రామునితో, తార (వాలి భార్య) అనిన మాటలు.. "నీవు ఉత్తమ ధార్మికుడవు, ఇంతకని లెక్కకు అందని వాడవు". భర్తని చంపిన వానిని దూషించకపోగ, పొగిడినది అంటె ఇంతకుమించి శ్రీరాముని గొప్పతనమును గురించిన ఉదాహరణ అవసరములేదు.
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి!!

No comments:
Post a Comment